డీమ్యాట్ ఖాతా లాభాలు

డీమ్యాట్ ఖాతా లాభాలు
  సెక్యూరిటీల యొక్క తక్షణ బదిలీ
సెక్యూరిటీల బదిలీ పై ఎలాంటి  స్టాంప్ డ్యూటీ ఉండదు.
కాగితపు  సర్టిఫికేట్లుకు వలే ఎలాంటి భయాలు ఉండవు.అనగా చినిగిపోవడం  దొంగతనం,నకిలీ  సర్టిఫికేట్లు, పోర్జరీ మొదలైనవి వంటివి.
సెక్యూరిటీల బదిలీ  సమయంలో  కాగితపు పని లో తగ్గింపు.
ట్రాన్సాక్షన్ కాస్ట్ లో తగ్గింపు
నామినేషన్ సౌకర్యం
DP రికార్డ్  లో చిరునామా  మార్పు నమోదు చేయడం వల్ల మీరు వాటా  కలిగి ఉన్న ప్రతి కంపెనీకి మీచిరునామా  మార్పుగురుంచి  తెలియచేయనవసరం లేదు
 folios / 
ఖాతాల నిర్వహణ అనుకూలమైన పద్ధతిని  కలిగి ఉంటుంది.
అన్ని రకాల సెక్యూరిటీలకు ఒకే రకమైన  ఖాతా ఉంటుంది.
మీ సెక్యూరిటీలలో బోనస్ కాని, స్ప్లిట్  లేదా విలీనం జరిగినప్పుడు మీ వాటా మీ ఖాతా యందు ఆటోమాటిక్ గా జమ అవుతుంది .

మ్యూచవల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వలన కలిగే ప్రయోజనాలు


మ్యూచవల్  ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వలన కలిగే  ప్రయోజనాలు

Professional Management 
మ్యూచవల్  ఫండ్స్ లో మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బును సరియైన పద్దతిలో ఇన్వెస్ట్ చేయడానికి అపారమైన అనుభవం  , నైపుణ్యం కలిగిన ఫండ్ మేనేజర్లు ఉంటారు. వారికి సహాయంగా మీ ఇన్వెస్ట్మెంట్ చూడాటానికి  టీం కూడా ఉంటుంది. వారు ఈక్విటీ ఫండ్స్  మరియు డేట్స్ ఫండ్స్  లలో ఇన్వెస్ట్ చేయడానికి ముందు రీసేర్చీ చేసి  పూర్తీ అవగాహన తో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు.మీరు   మ్యూచవల్  ఫండ్స్ గత చరిత్ర ను ఇంతవరకు పరిశీలించిన వారు స్థిరమైన రాబడిని అందిస్తున్నారు.
Diversification 
మీ ఫోర్ట్ ఫోలియోలో  డైవరిఫికేషన్ అనేది మీ పెట్టుబడికి రక్షణగాను  , దానికి స్థిరత్వం ఇచ్చేదిగా  ఉంటుంది.ఫండ్ మేనేజర్ మీ దగ్గర నుండి సేకరించిన డబ్బును వివిధ రకాల స్టాక్స్ మరియు సేక్యురిటిలలో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ వైవిధ్యమైన పెట్టుబడి ఇన్వెస్టర్స్ కు మంచి రాబడి అందిస్తుంది. అదే  మీరు స్వయంగా ఇన్వెస్ట్ చేస్టే  ఈ వైవిధ్యమైన పెట్టుబడి చేయడం మీకు సాధ్యం కాకపోవచ్చు. అంతే కాకుండా కొన్ని సమయాలలో మీ దగ్గర ఉన్న చిన్న మొత్తం ద్వారా ఇది అసలే సాధ్యం కాదు. కాని మ్యూచవల్  ఫండ్స్ కొంత మొత్తం ద్వారా కూడా సాధ్యం అవుతుంది.
 Convenient Administration
 మీరు మ్యూచవల్  ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం  ఎంతో సులభం . మీరు మ్యూచవల్  ఫండ్ పథకాన్ని నిపుణుడి సహాయంతో  ఎన్నుకొని ,దరఖాస్తు ఫారాన్ని  నింపి ,వారి పేరు మీదా చెక్కు  జారీ చేసి రావడమే .ఇది మొత్తం రెండు నిమిషాల పని . అదే విధంగా మీ ఇన్వెస్ట్మెంట్ తిరిగి తీసుకోవడం కూడా చాలా సులభం.
Return potential
 మ్యూచవల్ఫండ్సలోమధ్య కాలం నుండిదీర్ఘ కాలం కొరకు ఇన్వెస్ట్ చేసినచో మంచి రాబడి          అందిస్తాయి.ఎందుకంటే వారు వివిధ పథకాలలో ఇన్వెస్ట్ చేస్తుంటారు కాబట్టి.   

    Low cost
 కాబట్టి.   మీరు ఎటైనా ప్రయాణం చేస్తున్నప్పుడు బస్సులో వెళ్ళిన దానికంటే మీ స్వంత వాహనంలో వెళ్ళితే అధిక ఖర్చు   ఏ విధంగా  అవుతుందో అదే విధంగా ఇక్కడ కూడా  మ్యూచవల్  ఫండ్స్ పథకాలలో కొన్ని వేల మంది ఇన్వెస్ట్ చేయడం వలన ఫండ్ నిర్వహణ ఖర్చు తగ్గుతుంది. దానితో  మీకు కూడా తక్కువ ఖర్చు అవుతుంది. 
Liquidity
 మ్యూచవల్  ఫండ్స్ పథకాలలో నుండి మీరు ఎప్పుడు కావలి అంటే అప్పుడు ఉపసంహరించుకోవచ్చు.మీరు ఉపసంహరణ దరఖాస్తూ సంతకం చేసి ఇచ్చిన రెండూ మూడు రోజులలో మీ డబ్బు మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.   ఒక వేళ ప్రతేకంగా ఆ పథకానికి లాక్ ఇన్ పిరియడ్ , టాక్స్ సేవింగ్ పథకం ఐతే మాత్రం  సాధ్యం కాదు.ఓపెన్ ఎండెడ్ పథకాలనుండి ఎప్పుడైనా బయటకు రావచ్చు. క్లోజ్ ఎండెడ్ పథకాల యూనిట్స్ ని స్టాక్ ఎక్సేంజీ లో ఎప్పుడైనా అమ్ముకోవచ్చు.  మీకు   టాక్స్ సేవింగ్   అవసరమైతే తప్ప లేనిచో టాక్స్ సేవింగ్ పథకాల వైపు వెళ్ళవద్దు.
Transparency
 పారదర్శకత  అనేది మ్యూచవల్  ఫండ్స్ యొక్క ముఖ్యమైన ప్రయోజనం .ఒక ఇన్వెస్టర్ గా మీ డబ్బు ఎక్కడ ఇన్వెస్ట్ చేయబడినది , ప్రస్తుతం దాని విలువ ఎంత ఉన్నది మొదలగు వివరాలు మీకు క్రమం తప్పకుండా తెలియచేయబడతాయి.
 Choice of schemes
మీ పెట్టుబడి లక్ష్యాలకు అనుగుణంగా , మీరు తీసుకొనే రిస్కు స్వభావానికి అనుగుణంగా , మీరు నిర్ణయించుకున్న నిర్ణీత కాలానికి అనుగుణంగా  , మీ అవసరాలకు అనుగుణంగా ,మీరు వివిధ రకాల మ్యూచవల్  ఫండ్స్ పథకాలను ఎంచుకొనే  అవకాశం కలదు. మీకు  ఈక్వీటీ   మార్కట్ , డేట్ మార్కెట్ , మనీ మార్కెట్ , ఈ టి ఫ్స్  , గోల్డ్ ఈ టి ఫ్స్, టాక్స్ సేవింగ్ ,  ఇలా  వివిధ రకాల పథకాలు  మీకు అందుబాటులో ఉంటాయి.
 Well regulated
 మీ అన్ని మ్యూచవల్  ఫండ్స్ కూడా సేబీ వద్ద రిజిస్టర్ కాబడి , సెబీ నిబందనల ప్రకారం పనిచేయబడతాయి. ఈ మ్యూచవల్  ఫండ్స్ ను సేబీ రెగ్యులర్ గా మానిటర్ చేస్తుంది.
 Tax benefits
మ్యూచవల్  ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా  టాక్స్ మినహాయింపులు పొందవచ్చు. ఈ మినహాయింపులు సమయానుకూలంగా  మారుతుంటాయి. మనం దీని గురుంచి మరో చాప్టర్ లో చదువుకుందాం.

01-01-2013 నుండి మీ వద్ద గల బ్యాంక్ చెక్స్ చెల్లుబాటు కావు. ప్రతి ఒక్కరూ తప్పకుండా చదివితీరవాల్సిన ఆర్టికల్


01-01-2013  నుండి మీ వద్ద గల బ్యాంక్ చెక్స్ చెల్లుబాటు కావు.
ప్రతి ఒక్కరూ తప్పకుండా చదివితీరవాల్సిన ఆర్టికల్  
చాలా సమయలలో మీరూ చెక్స్ ను టాంపరింగ్ చేస్తూ జరిగే మోసాల గురించి వినే ఉంటారు. ఇలాంటి  మోసాలను మరియు చెక్ క్లియరింగ్ సమయంలో జరిగే జాప్యాన్ని నివారించడానికి రిజర్వుబ్యాంక్ CTS-2010  స్టాండర్డ్ ఉన్నటువంటి చెక్స్ మాత్రమే జారీ చేయాలని బ్యాంక్స్ ను కోరడం జరిగినది. దానికి అనుగుణంగా మీ వద్ద గల పాత చెక్స్  01-01-2013  నుండి చెల్లు బాటు కావు.  మీ వద్ద గల పాత చెక్స్ ను బ్యాంక్స్ అప్పటి  నుండి  అంగీకరించవు.అందువలన మీ వద్ద గల పాత చెక్స్ బ్యాంక్ కి తితిగి ఇచ్చివేసి   CTS-2010  స్టాండర్డ్ ఉన్నటువంటి చెక్స్ తీసుకోవలసి ఉంటుంది.  మీరూ  క్రింద ఇచ్చిన చిత్రంలో SBI బ్యాంక్ ఇచ్చిన అడ్వర్టైజ్ ను గమనించవచ్చు.
బ్యాంక్స్ వారి రికార్డ్స్ లో నమోదు ఐనటువంటి మీ అడ్రెస్ కి  ఈ కొత్త చెక్ బుక్స్ పంపిస్తున్నాయి. ఒకవేళ మీ అడ్రెస్ మారిన  , ఎందుకైనా  మంచిది అనుకున్న మీ బ్యాంక్ ను సంప్రదించడం మంచిది. అంతే కాకుండా ఒకవేళ మీరూ ఇదివరకే ఎవ్వరికైనా చెక్స్ ఇచ్చిన లేదా మీరూ ఎవ్వరి  వద్ద  ఐనా చెక్స్ తీసుకుంటే ఆ చెక్స్ 01-01-2013  నుండి ఎట్టి పరిస్థుతులలో చెల్లుబాటుకావు అనే విషయం తెలుసుకోండి. కొంతమందికి ఎవ్వరికైనా అప్పు ఇచ్చిన , తీసుకున్న పోస్టు డేటెడ్ చెక్స్ ఇవ్వడం లేదా తీసుకోవడం  అలవాటు సహజంగా ఉంటుంది. ఇలాంటి వారూ ముందస్తూగా జాగ్రత్త పడటం మంచిది.
cheque  truncation system (CTS) సిస్టం ను రిజర్వు బ్యాంక్ ప్రయోగాత్మకంగా డిల్లీలో చేపట్టడం జరిగినది. తర్వాత చెన్నై , ప్రస్తుతం దేశం మొత్తం  విస్తరించే పనిలో ఉంది. ఇంతకు ముందు చెక్ క్లియరింగ్ కోసం బ్యాంక్ లో జమచేసినప్పుడు చెక్ ను సంబందిత బ్యాంక్ కి పంపించేవారు.ప్రస్తుతం రాబోతున్న చెక్స్  సంబందిత బ్యాంక్ కి పంపించవలసిన అవసరం లేకుండా  కేవలం ఆ చెక్ స్కాన్ చేసి పంపిస్తే సరిపోతుంది. అందుకు అనుగుణంగా వివిధ రక్షణ చర్యలతో ఈ కొత్త చెక్స్ రూపొంచబడ్డాయి.ఈ కొత్త చెక్స్ లో అండాకారంలో వాటర్ మార్క్స్ రూపొందించబడినాయి.అల్త్రావాయిలేట్ లైట్ క్రింద  చూసినప్పుడు క్లియర్ గా కన్పిస్తుంది.కొత్త చెక్ క్రింది విధంగా ఉండగలదు.




షేర్ మార్కెట్ లో కి ప్రవేశిస్తున్నారా:


షేర్ మార్కెట్ లో కి  ప్రవేశిస్తున్నారా:

ఒక్క  క్రికెట్ అటగాడు అంతర్జాతీయ క్రికెట్ లో ప్రవేశించినప్పుడు అతడి ప్రదర్శన మీద అతడి భవిష్యత్తు  ఎలా ఆధారపడి ఉంటుందో  షేరు మార్కెట్ లో కి  ప్రవేశించే చిన్న ఇన్వెస్టర్ కు కూడా ఇదే వర్తిస్తుంది. మొదటి సారి కొన్న షేరు మంచి లాభాలు ఇవ్వకపోయినా కనీసం నష్టాల బారిన పడవేయకుండా ఉంటే చిన్న ఇన్వెస్టర్ మరోసారి మార్కెట్ లో కి అడుగు పెడతాడు . ఫలితం దీనికి భిన్నంగా ఉంటే షేరు మార్కెట్ అంటే భయపడతాడు. మార్కెట్ అంటేనే జూదశాల  అంటూ శాపనార్ధాలు పెట్టె వారి జాబితాలోకి చేరి పోతాడు. మార్కెట్ రేసులో విజేతగా నిలవడమా, పరాజయం పాలవటమా  అన్నది చాలా సందర్బాలలో అది మీ చేతులలోనే ఉంటుంది.
సమయం కేటాయించాగాలరా:
షేర్లకు , ఇతర పెట్టుబడి సాధనాలకు ఎంతో భేదం ఉంది. షేర్లు కోఎసి కొన్నాళ్ళు వాటి గురుంచి మరఛిపోదాం అంటే  కుదరదు. మీరు కొన్న షేరు ధరలను , వాటిని ప్రభావితం చేసే పరిణామాలను  ప్రతి రోజూ గమనిస్తూ ఉండాలి. అందుకే మొట్టమొదటి సారి షేర్ల కొనుగోలుకు దిగేముందు తన పెట్టుబడులను నిరంతరం పర్యవేక్షించడం కోర్కి ఎంత సమయం కేటాయించగమన్న విషయాన్ని తేల్చుకోవాలి. కనీసం వారానికి ఒక్కసారి ఐన ధరలను గమనించకపోతే లాభాల అవకాశాలు చేజారిపోతాయి.
షేరు మార్కెట్కు , ఆర్ధిక పరిస్తుతులకు చాల దగ్గరి  సంభందం ఉంది. ఆర్ధిక రంగం లో జాతీయంగా, అంతర్జాతీయముగా జరిగే అనేక పరిమాణాలు మార్కెట్ ను ప్రభావితం చేస్తాయి.స్టాకు మార్కెట్ లో నిలదొక్కుకోవాలంటే ఈ అంశాలపై  ఆవగాహన కలిగి ఉండటం తప్పనిసరి . కనీసం షేర్ల ధరలను . ప్రభావితం చేసే అంశాలపై   అవగాహన పెంచుకోవాలి. ఆ విషయాలలో మీ గురుంచి మీరు సంతృప్తి  చెందితే షేర్లలో పెట్టుబడి పెట్టడానికి  ప్రయంతించవచ్చు.
మీఋ తప్పకుండా సమాచార సేకరణ తప్పనిసరిగా చేయాలి.ఫలానా షేరు కొంటె లాభాల పంటేనంటూ ఊరించే టిప్స్ కూ లోటూ లేదు.వీటిని చూసిన  ఇన్వెస్టర్ కు మార్కెట్ అంటే లాభాల గనిలా అనిపిస్తుంది. లాభాలకు దారి చూపేది మీ అవగాహనా  మాత్రమేనని తెలుసుకోవాలి.

“First learn and then earn”

Share మార్కెట్ ట్రేడింగ్ మరియు ఇన్వేస్టింగ్ అనునది చేయడానికి   సరైన విజ్ఞానం అవసరం, కావునముందు తగినంత పరిజ్ఞానం పొందిన తర్వాత మార్కెట్ లో మీరు సంపాదించడం  మొదలు పెట్టండి.  ముందుగా మీరు స్టాకు మార్కెట్ గురుంచి లెర్నింగ్ చేయండి.ఈ లెర్నింగ్ ద్వారా మీరు స్టాకు మార్కెట్ లో ఏర్నింగ్ చేయవచ్చు.మీరు తప్పకుండా ఒక్క విషయం  గుర్తుంచుకోండి. ఏ  రంగం లో ఐనా  లెర్నింగ్ లేకుండా ఏర్నింగ్ సాధ్యం కాదు .కాబట్టి మీరు లెర్నింగ్ ప్రారంభించండి.

స్టాక్ మార్కెట్ అంటే భయం ఎందుకు ?


స్టాక్ మార్కెట్ అంటే భయం ఎందుకు ?
ఈక్వీటీ లేదా షేర్ అంటే అర్ధం ఏమిటి ? ఈ ప్రశ్న చాలా మంది మన దేశ ఇన్వెస్టర్ల  మదిని తోలిచివేస్తుంది.ఈక్వేటీ మార్కెట గత పది, ఇరవై , ముప్పై సంవత్సరాల నుండి  మంచి రాబడిని అందిస్తుంది. కాని మన దేశ ఇన్వెస్టర్లు మాత్రం ఈక్వీటీ మార్కెట్ లో మంచి రాబడి అందుకోవడం లో మాత్రం విఫలమవుతున్నారు. మన దేశ స్టాక్ మార్కెట్ లో మన దేశ ఇన్వెస్టర్ల కంటే కూడా విదేశీ ఇన్వెస్టర్లు  మంచి రాబడి అందుకుంటున్నారు.ఈ ఆర్టికల్ లో మీరూ స్టాక్ మార్కెట్ ఉపయోగించి  మీ సంపద ఎలా వృద్ది చేసుకోవాలో తెలియచేయడం జరుగుతుంది.
ఒక ఫైనాన్షియల్ అడ్వయిజర్ గా మిమ్ములను ఈక్వీటీ లలో లేదా ఈక్వీటీ సంభందిత మ్యుచవల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయమని మీకు చెప్తే  మీ దగ్గర నుండి వచ్చే మొదటి సమాధానం  మేము మా  అమౌంట్ తో ఎలాంటి రిస్కు తీసుకోలేము కాని మా అమౌంట్ పై మంచి రాబడి రావాలి అని మాత్రం చెప్తారు. ఇది వరకటి ఆర్టికల్స్ లో దీర్ఘకాలంలో అధిక రాబడి  యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంటుందో మీకు తెలియచేయడం జరిగినది.అదే విధంగా స్టాక్ మార్కెట్ కూడా దీర్ఘకాలంలో మనదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అధిక రాబడి ఏ విధంగా అందించడం జరిగినదో మీకూ తెలుసు .కాని  మన దేశ ప్రజలూ మాత్రం ఈక్వీటీ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఎంత మాత్రం ఇష్టపడరు. మనదేశంలో  కేవలం  5-6% మాత్రమే  డైరెక్ట్ గా లేదా ఇండైరెక్ట్ గా  ఈక్వీటీలలో  ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. క్రింద ఇవ్వబడిన చార్ట్ ను ఒక్కసారి పరిశీలించండి .గత ముప్పై సంవత్సరాల  క్రితం మీరూ  Rs100 లను వివిధ రకాల అసెట్ తరగతులలో ఇన్వెస్ట్ చేస్తే వాటి రాబడి ఏ విధంగా ఉందొ ఒక్కసారి చూడండి..


ఈక్వీటీ అంటే మీకూ తెలుసుకదా ? ఒక వ్యాపారం లో  భాగస్వామ్యం లేదా వాటా అని.1000 షేర్లు ఉన్న XYZ  అనే కంపెనీలో మీకు 10 షేర్లు ఉన్నాయి అంటే మీరూ ఆ కంపెనీలో 1 % వాటా కలిగి ఉన్నారు అని అర్ధం. XYZ   కంపనీ లాభాలు పొందుతుంటే మీ వాటకి అనుగుణంగా డివిడెండ్ అందుకోవడం మరియు మీ షేర్ల  ధరలో పెరుగుదల వలన మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కూడా పెరుగుతుంది . ఒకవేళ కంపెనీ నష్టాలలో ఉంటె మీ షేర్ల ధరలో తగ్గుదల వలన మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కూడా తగ్గుతుంది. 
మిమ్ములను ఒక ప్రశ్న అడుగుతాను. మీరూ ఒక వ్యాపారం ప్రారంభం చేసి అది మంచి లాభాలు గడించాలి అంటే మీరే కాదు ఎవ్వరైనా చెప్పే సమాధానం ఒక్కటే . కొంత కాలం తప్పకుండా పడుతుంది అనేది. ఇంకా చెప్పాలి అంటే మంచి వృద్దిలోకి రావడానికి దీర్ఘకాలం పడుతుంది అంతవరకు ఓపిక పట్టాలి  అనే  విషయం మీకు తెలుసుకదా ? ఇంత చిన్న సాదరణ విషయాన్ని మనం వేరే వాళ్ళ వ్యాపారంలో షేర్ల రూపంలో పెట్టుబడి పెడుతున్నప్పుడు ఎందుకు మర్చిపోతాం.  మనం షేర్లలో ఇన్వెస్ట్ చేయగానే మరుసటి రోజు నుండే లాభాలు వచ్చాయా లేదా అని చూడటం చేస్తూ ఉంటాం. ఇంకా కొంత మంది చెప్తూ ఉంటారూ మేము లాంగ్ టర్మ్  ఇన్వెస్ట్ చేస్తుంటాం. వారి దృష్టిలో లాంగ్ టర్మ్  అంటే ఒకనెల లేదా ఒక సంవత్సరం  మాత్రమే. నిజంగా మీరూ చేసే వ్యాపారం అంత త్వరగా అభవృద్ధి చెందుతుంది అని భావిస్తున్నారా ? కాదు కదా ? మరి అంత త్వరగా మీరూ ఇన్వెస్ట్ చేసిన షేర్ల ధరలు పెరగాలి అని అనుకుంటారు.
మీరూ ఆపిల్  లేదా ఏ ఇతర అనే పండ్లను పండించాలి  అంటే మీరూ తప్పకుండా  క్రింది విధంగా ఉండాలి?
ముందుగా మీరూ విత్తనాలను నాటాలి
అది పెరగడానికి సరిపడా నీళ్ళు పోయాలి
కొంత కాలం ఓపికతో వేచి చూడాలి 

కొంత కాలం తర్వాత మీ హార్డ్ వర్క్ , మీ ఓపికకి ప్రతిఫలంగా  పండ్లను అందుకోగలుగుతారు. నిజమే కదా ? అదే ఈక్వీటీ ల విషయానికి వస్తే మాత్రం తొందరగా లాభాలు అందుకోవాలి అని చూస్తారు.మీలో ఎంత మంది నిజంగా అర్ధం చేసుకుంటున్నారు చెప్పండి. ఈక్వీటీలలో  పెట్టుబడి అంటే దీర్గకాలం కొనసాగితే మంచి లాభాలు వస్తాయి అనే విషయం తెలిసి కూడా ఎదురుచూడలేకపోతున్నారు. మీలో చాలా మంది బంగారం తరతరాలుగా దాచుకోవడం చేస్తుంటారు. తాతలు మనవళ్ళు, మనవరాళ్ళ కోసం బ్యాంక్ లో ఫిక్సుడ్ డిపాజిట్ చేయడం  చేస్తునేఉంటారు . కాని ఎంత మంది  అదే బ్యాంక్ ఈక్వీటీ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీకు బ్యాంక్ మీదా అంతనమ్మకం ఉన్నప్పుడు కనీసం ఆ బ్యాంక్ షేర్లలో ఇన్వెస్ట్ చేయడం వలన ఎలాంటి  భయం లేదు కదా ?
సాదారణంగా ఈక్వీటీలు రెండు రకాలుగా లాభాలు అందిస్తాయి.ఒకటి స్పెక్యులేటివ్ పరంగా , రెండవది ఫండమెంటల్ గ్రోత్ పరంగా .95% ఇన్వెస్టర్లు కేవలం  స్పెక్యులేటివ్ పరంగా తక్కువ కాలంలో లాబాలు అందుకోవడానికే  ప్రయత్నిస్తున్నారు.అంటే స్వల్ప కాలంలో షేర్ల ధరల మార్పు ఆధారంగా లాభాలు అందుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.ఈ విధంగా అతి తక్కువకాలంలో లాభాలు అందుకోవడానికి ప్రయత్నించే సమయంలోనే నష్టాల పాలు కావడం జరుగుతుంది. స్వల్పవ్యవధిలో మార్కెట్ ను అంచానా వేయాలి అంటే చాలా  టెక్నికల్ అనాలసిస్ లో చాలా అనుభవం కావలసి ఉంటుంది.ఈక్వీటీలలో దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేయడం వలన కేవలం లాభాలు అందుకోవడం మాత్రమే కాదు సంపద కూడా వృద్ది చెందుతుంది. మీరూ ఏదైనా వ్యాపారం కాని, భారత ఆర్ధిక వ్యవస్థ కాని రాబోయే నెలరోజులలో ఎలా ఉండబోతుందో చెప్పండి అంటే చెప్పగలరా లేదు కదా ? అదే ఐదు, పది సంవత్సరాలలో ఎలా ఉండబోతుంది అంటే తప్పకుండా జవాబు చెప్పగలరు. ఏవి ఏ విధంగా రాబడి అందించాయో తెలుస్తుంది.
ఇక రిస్కు విషయానికి వస్తే తప్పకుండా స్వల్పకాలంలో షేర్ల ధరల హెచ్చుతగ్గుల వలన ఏర్పడే రిస్కు తప్పకుండా ఉంటుంది .కాని మీరు దీర్ఘకాలం కొరకు ఇన్వెస్ట్ చేస్తే  ఉండే రిస్కు చాలా స్వల్పం.మీరూ పైన ఇచ్చిన చార్ట్ ఒక్కసారి చూడండి.  ఈక్వీటీలు అందించిన రాబడి మరే ఇతర సాధనాలు అందించలేదు.ఈక్వీటీలు అంత మంచి రాబడి అందించినప్పుడు  ఎందుకు చాలా మంది ఇన్వెస్ట్ చేయలేకపోతున్నారు  అంటే దీర్ఘకాలం కోసం కాకుండా స్వల్ప కాలంలో లాభాలు అందుకోవాలి  అనే అత్యాశతో వచ్చిన వాళ్ళు , సగం అవగాహన తో స్టాక్ మార్కెట్ అంటే జూదం అనే అభిప్రాయంతో ఉండే వారూ , సరియైన  పరిజ్ఞానం లేకుండా సలహాలు ఇచ్చే వారి వాళ్ళ స్టాక్ మార్కెట్ అంటే ఒక తప్పుడు అభిప్రాయం  నెలకొంది.అందువలన మీరూ దీర్ఘాకాలం కోసం ఇన్వెస్ట్ చేయండి. మీరూ స్టాక్ మార్కెట్ లో సంభవించే హెచ్చుతగ్గులను చూసి భయపడుతూ  ప్రతిరోజు మీరూ ఇన్వెస్ట్ చేసిన కంపెనీ షేర్ల ధరలు చూసి భయపడవలసిన అవసరం ఎంత మాత్రం లేదు.మీరూ మంచి ఆర్ధిక నిపుణల సలహలు మాత్రమే తీసుకోండి. అంతే కాని మిడిమిడి జ్ఞానం తో ఉండే వారి సలహాలు ఎట్టి పరిస్థితులలో వద్దు. చివరగా మీకు చెప్పేది ఒక్కటే. ఈక్వీటీలలో దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేయండి. మీరూ ఇన్వెస్ట్ చేసిన కంపెనీ , దేశ అభివృద్దితో పాటు మీరూ అభివృద్ధి చెందండి.స్టాక్ మార్కెట్ పై మీకూ ఉండే భయాన్ని వీడనాడండి .             


ఆర్ధిక విషయాలలో నిర్ణయించుకోవడానికి , ఆచరణలో పెట్టడానికి మధ్య గల తేడా ఏ విధంగా ఉంటుందో చూద్దాం.


ఆర్ధిక విషయాలలో నిర్ణయించుకోవడానికి  , ఆచరణలో పెట్టడానికి మధ్య గల తేడా ఏ విధంగా ఉంటుందో చూద్దాం.
ఒక చెరువు గట్టు పై ఐదు కప్పలు కూర్చొని ఉన్నాయి.
వాటిలో నాలుగు నీటిలోకి దూకాలి అని నిర్ణయించుకున్నాయి.
ఇంకా ఎన్ని మిగిలి ఉంటాయి?
మీ సమాధానం ఏమిటి?
తొందరపడకుండా అలోచించి చెప్పండి.దాదాపుగా అందరికి తెలిసిన సమాధానమే .
సమాధానం ఐదు కప్పలు.
ఎందుకంటే నాలుగు కప్పలు దూకాలి అని నిర్ణయించుకున్నాయి . కాని ఆచరణలో పెట్టలేదు. నిర్ణయించుకోవడానికి , ఆచరణలో పెట్టడానికి చాలా తేడా ఉంది. అదే విధంగా చాలా మంది ఆర్ధిక వ్యవహారలాలో ఈ విధంగా చేయాలి , ఆ విధంగా చేయాలి అని నిర్ణయించుకుంటారు  తప్ప ఆచరణలో ఎంత మాత్రం పెట్టారు.సాదారణంగా సంపద మీ ఆర్ధిక విషయాలలో నిర్ణయం తీసుకొని ఆచరణలో పెట్టిన వారి వద్దకే వస్తుంది. ఆచరణలో పెట్టె సమయంలో కొంత రిస్కు తీసుకోగలగాలి.  రిస్కు లేకుండా రాబడి ఉండదు అనే విషయం తెలుసుకోవాలి.దాని కొరకు కొంత హార్డ్ వర్క్ చేయక తప్పదు.జీవితంలో అర్దికంగా ఎదగాలి అంటే అందుకు అనుగుణమైన అవకాశాలను గుర్తించడం , నిర్ణయం తీసుకోవడం , ఆచరణలో పెట్టడం తప్పనిసరి.   

పెట్టుబడి (ఇన్వెస్టింగ్ ) అనగానేమి?


పెట్టుబడి (ఇన్వెస్టింగ్ ) అనగానేమి?
రేపటి జీవనం ఎలాంటి ఒడిదోడుకులులేకుండా సాగాలంటే భవిష్యత్తు లో వచ్చే ఆదాయం కోసం  మనం సంపాదించిన సంపదలో మన ఖర్చులు పోగా మిగిలిన సంపదను  పెట్టుబడిగా పెట్టి మరింత సంపదను పొందడమే పెట్టుబడి.ఈ పెట్టుబడి అనునది మనం స్తిరాస్తి , బ్యాంకు డిపాజిట్లు, వడ్డీ ఆదాయం , అద్దె ఆదాయం , షేర్స్ ,మ్యూచువల్ ఫండ్స్,బాండ్స్, సేవింగ్ సర్టిఫికేట్లు, వివిధ పోస్ట్ ఆఫీసు ఫథకాలు, బంగారారం  మొదలగు వాటిలో పెడతాం.మన పెట్టుబడి ఒక్క ముఖ్య ఉద్దేశం  సంపద సృష్టించడం , దానితో పిల్లల కళాశాల ఫీజులు. పెళ్ళిల్లు, సెలవులలో  సరదాగా  గడపడం, మంచి జీవన ప్రమాణానికి,రిటైర్మెంట్ తర్వాత జీవితం సాపీగా జరుగుటకు , మీ అనంతరం ఈ సంపద మీ తరాల వారికి  చేర్చటం,ఈ పెట్టుబడి వల్ల వచ్చే  రాబడి పెరుగుతున్న  ద్రవ్యోల్బణం  కంటే అధికంగా ఉండాలి. ఎప్పుడైనా సరే సంపదను కాపాడటం మరియు దానిని అభివృద్ధి చేయడం అనేది ఒక్క కళ.
స్టాకు మార్కెట్ లో పెట్టుబడి వల్ల మీరు మిగితా వాటిలో  పొందిన రాబడి కంటే అధిక రాబడి పొందగలరు.కాని దీనికి మీకు స్టాకు మార్కెట్ పై  పరిపూర్ణ జ్ఞానం, దీర్గాకాలిక  పెట్టుబడి వ్యూహం ,సరియైన స్టాకు ను ఎన్నుకోవడం మొదలగు వాటి మీద ఆధారపడి ఉంటుంది. మీరు పెట్టుబడి  అనునది మీ సంపాదన మొదలైన తొలినాళ్ల నుండే  క్రమ పద్దతిలో దీర్గాకాలిక  వ్యూహంతో  మొదలు పెట్టాలి.మీరు తొలినాళ్ళ నుండే మొదలు పెడితే అనుకోకుండా జరిగే ఎలాంటి రిస్కులను ఐనా తట్టుకోగలరు .అంతే కాకుండా ఒక్కవేళ  మీరు మీ రిటైర్మెంట్ నాటికి యాభై లక్షలు సంపాదించడం మీ లక్ష్యం ఐతే మీరు  మీ సంపాదన తొలినాళ్ల  నుండే  పెట్టుబడి మొదలు పెడితే  మీ లక్ష్యం  చేరుకోవటం చాలా సులభం అవుతుంది.మార్కెట్లో పెట్టుబడులు అంటే రిస్క్ అంటారు.స్తిరాస్తి , బంగారం  , చివరకు మనకు అన్నం పెట్టె రైతన్న చేసే వ్యవసాయం లో కూడా ఎంతో రిస్కు ఉంది.పండించే పంట చేతికి వచ్చే వరకు అనుక్షణం రిస్కు వానలు లేకపోవడం . అధిక వానలు, విద్యుత్తు సమస్య ,పురుగులు పట్టడం , మద్దతు ధర మొదలగు రూపాలలో రిస్కు  ఉంటుంది. ఇదే విధంగా మీరు  ఏ రంగం తీసుకున్న రిస్కు అనేది తప్పకుండా ఉంటుంది.
స్టాకు మార్కెట్ లో పెట్టుబడులంటే ఏమిటి? అనిసాదారణ పౌరుడిని ప్రశ్నిస్తే  జూదం , లాటరీ , పేకాట గుర్రపు పందెం లాంటి సమాధానాలు రావచ్చు.కాని నిజానికి అది అపోహ మాత్రమే . లాటరీ , గుర్రపు పందేలు గెలవడానికి  అదృష్టం కావాలి కాని స్టాకు మార్కెట్లో  డబ్బు సంపాదించడానికి అవగాహన ,మార్కెట్ రిస్కులను ముందే పసిగట్టగల కాసింత జ్ఞానం కావాలి. స్టాకు మార్కెట్ అనేది మంచి పెట్టుబడి సాధనం . చక్కటి ప్రణాళిక ద్వారా , క్రమపద్దతిలో సమర్దవంతంగా  పెట్టుబడి పెడితే చట్టబద్ధంగా స్టాకు మార్కెట్ లో సంపాదించిన సంపదను ఇంకా దేనిలోనూ సంపాదించలేము.స్టాకు మార్కెట్ అంటే జూదం అన్న భావన విడనాడి పెట్టుబడులకు ఉపయోగమైన వేదికగా భావించాలి.

స్టాక్ మార్కెట్ పై అవగాహన


స్టాక్ మార్కెట్ పై అవగాహన  
స్టాకు మార్కెట్ ఈ  మాట వినగానే చాలామంది దానిని ఒక భూతంలాగా, లేదంటే ఒక జూదశాలగా చూస్తారు తప్ప దానిని ఒక ఇన్వెస్ట్మెంట్ సాధనంగా అసలు చూడరు. ఎందుకంటే  చాల మంది దానిలో ప్రవేశించి రాత్రి కి రాత్రే డబ్బులు సంపాదించాలి అనే అత్యాశ ,అవగాహనా లోపం, మరియు సరియైన పరిజ్ఞానం లేకుండా ప్రవేశించి నష్టాల పాలు అవుతుంటారు. నిజం చెప్పాలంటే  తగు పరిజ్ఞానం, మంచి ప్రణాళిక తో స్టాకు మార్కెట్ లో ప్రవేశిస్తే దీనిలో  పొందిన రాబడి ఇక  మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ సాధనం లో పొందలేరు.  మార్కెట్ అనలిస్టు గా  నా ప్రత్యక్ష అనుభవంలో  నేను తెలుసుకున్నది ఏమనగా  స్టాకు మార్కెట్ లో ప్రవేశిస్తూన్న వారిలో చాలా మంది కనీస అవగాహన లేకుండానే ప్రవేశిస్తున్నారు.దానితో  వారు మార్కెట్ లో డబ్బులు పోగొట్టుకొని అప్పుడు  దానిని అది ఒక జూదశాల  అని నిందిస్తూ అది మనకు అర్థం కాదు అనే ఒక అభిప్రాయానికి వచ్చేస్తారు,మీరు పది రూపాయలు ఖర్చు పెట్టి టమాటలు కొనేటప్పుడు ఐదు నిమిషాలు దానిలో పుచ్చులు ఉన్నాయా లేవా  అని చూడటానికి కేటాయించిన మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు సంపాదించాలి అంటే దానికి కూడా సమయం కేటాయించి కావలసిన విజ్ఞానం  పొందాలి అనే విషయం గుర్తుంచుకోవాలి..మీరు స్టాక్ మార్కెట్ లో డబ్బు సంపాదించాలి అంటే ముందుగా మీరు లెర్నింగ్ స్టార్ట్ చేయాలి , లెర్నింగ్ చేస్తే ఏర్నింగ్  వస్తుంది.లెర్నింగ్ లేకుండా ఏర్నింగ్ ఉండదు.ఏదో పొద్దున్న లేచాం కంప్యూటర్ ముందు కూర్చున్నాం ట్రేడింగ్ చేసాం అంటే తప్పకుండా నష్టపోవలసి ఉంటుంది.  ఈ బ్లాగ్  మీకు షేరు మార్కెట్  లో  బేసిక్ నుండి మొదలు పెట్టి షేరు మార్కెట్   మీద పూర్తీ అవగాహనను కలుగచేస్తుంది. షేరు మార్కెట్ లో మీరు ప్రవేశించినది మొదలు  మీకు కలిగే అనేక సందేహాలకు సమాధానం చెప్పుతుంది. షేరు మార్కెట్లో  మీరు షేర్లు ఎలా  కొనాలి ,  ఎప్పుడు కొనాలి ,ఎప్పుడు అమ్మాలి, IPO  గురించి ,లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చూడవలసిన ఫండ మెంటల్ విషయాలు,డే ట్రేడింగ్ నందు జరిగే పొరపాటులను   ఏ  విధంగా నివారించవచ్చో తెలుపుతుంది. సిప్ ఇన్వెస్ట్మెంట్ .మ్యూచవల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ గురుంచి తెలుపుతుంది.స్టాక్ మార్కెట్ లో సాధారణంగా చేసే పొరపాట్లు , వాటి వలన సంభవించే నష్టాల నుండి ఏ విధంగా బయటపడాలో వివరంగా తెలుపుతుంది.  ఈ బ్లాగ్  లో మీ సౌలభ్యం కొరకు  కొంత వరకు సాధారణంగా ట్రేడర్స్ ఉపయోగించే ఇంగ్లీషు పదాలనే వాడటం జరిగినది.  ,ఈ బ్లాగ్  లో నేర్చు కొనే  విషయాలు నిరంతరం మననం చేసుకొంటూ స్టాక్ మార్కెట్ లో మంచి లాభాలు ఏ విధంగా అందుకోవాలో తెలియచేస్తుంది. ముందుగా మీరూ స్టాక్ మార్కెట్ పైన మీకూ ఉండే అపోహలు వీడనాడండి. ఒక విషయం మీరూ తప్పక గుర్తుపెట్టుకోండి. ఈ బ్లాగ్ మీకూ అర్దిక విషయాలపై కేవలం అవగాహన కలుగచేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది.మీరూ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు నిపుణుల సలహా తీసుకోగలరు.అంతేకాని తెలిసితెలియని వ్యక్తుల సలహాలు మాత్రం వద్దు.   

బ్యాంక్ లో ఫిక్సుడ్ డిపాజిట్లు చేయడం వలన లాభామా ? నష్టమా ? ఒకసారి వివరంగా తెలుసుకుందాం?


బ్యాంక్ లో ఫిక్సుడ్ డిపాజిట్లు చేయడం వలన లాభామా ? నష్టమా ?  ఒకసారి వివరంగా తెలుసుకుందాం?
చాలా మందికి బ్యాంక్ లో ఫిక్సుడ్ డిపాజిట్లు చేయడం అంటే చాలా ఇష్టం.వారూ వారి జీవితంలో సంపాదించిన సంపద మొత్తం బ్యాంక్ లో  ఫిక్సుడ్ డిపాజిట్లు చేయడానికే ఇష్టపడుతుంటారు.మన దేశంలో  కేవలం 4% కంటే తక్కువ మంది మాత్రమె స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మిగిలిన వారందరూ వారి జీవితంలో కస్టపడి సంపాదించిన డబ్బూ మొత్తం కేవలం బ్యాంక్ లో  ఫిక్సుడ్ డిపాజిట్లు చేయడానికే అధిక ప్రాధాన్యత ఇస్తారు.నాకు చాలా అచ్చర్యం వేస్తుంది  ఎందుకు అంతగా బ్యాంక్ డిపాజిట్లపై మక్కువ చూపుతారో ? ఈ విషయంలో చాలా మంది ని నేను వారి అభిప్రాయం  కోరడం జరిగినది.  అందులో  యువత నుండి ఎనబై సంవత్సరాల వయస్సు వారూ కూడా ఉండటం జరిగినది. అధిక శాతం మంది  చెప్పిన సమాధానాలు క్రింది విధంగానే ఉన్నాయి.
1 SAFETY  :సాదారణంగా మనందరం మన డబ్బూ ఇన్వెస్ట్ చేసేసమయంలో  ముఖ్యంగా ఆలోచించేది మన డబ్బూ భద్రత గురించే. భద్రత విషయంలో  అందరం ఒకే రకంగా ఆలోచిస్తాం. ఇందులో ఎలాంటి సందేహం లేదు.చాలా మంది స్టాక్ మార్కెట కంటే బ్యాంక్  ఫిక్సుడ్ డిపాజిట్లు చేయడం లో చాలా భద్రత ఉంటుంది  అనే అభిప్రాయం లోనే ఉన్నారు.

2 LIQUIDITY IN EMERGENCY: చాలా మంది ప్రజల భావన  బ్యాంక్ లో   ఫిక్సుడ్ డిపాజిట్లు చేయడం వలన ఏదైనా ఎమర్జెన్సీ సమయంలో డిపాజిట్లను సులభంగా నగదుగా మార్చుకొనే సౌకర్యం ఉండటం. ఎమర్జెన్సీ సమయంలో ఉపయోగపడతాయనే ఉద్దేశంతో నే చాలా మంది స్టాక్ మార్కెట్ కంటే బ్యాంక్ లో    ఫిక్సుడ్ డిపాజిట్లు చేస్తున్నామని తెలియ చేయడం జరిగినది.  ఈ విషయంలో నేనే కాదు చాలా మంది ఆర్ధికవేత్తలు కూడా ఒప్పుకోవడం జరిగినది. ప్రజలూ కేవలం పై రెండు ఉద్దేశాలవలన అంటే  SAFETY మరియు LIQUIDITY IN EMERGENCY  కొరకు మాత్రమె బ్యాంక్ లో ఫిక్సుడ్ డిపాజిట్లు చేయడం  జరుగుతుంది.కాని పై రెండు విషయాల పట్ల నా వాదన మాత్రమె కాకుండా ప్రముఖ ఆర్ధికవేత్తలు , ఫైనాన్స్ అడ్వయిజర్లు , ఆర్ధిక అక్షరాస్యత కలిగిన వారి  అభిప్రాయం మాత్రం వేరే  విధంగా ఉంటుంది.
అందరూ ముందుగా బ్యాంక్ లో  ఫిక్సుడ్ డిపాజిట్లు చేయడం  వలన అధిక భద్రత ఉంటుంది అనే మోజులో మీ డబ్బూ యొక్క విలువను తగ్గించే  రెండూ ముఖ్యమైన విషయాలు మర్చిపోతున్నారు .అందులో మొదటిది ఇన్ఫ్లేషన్ , రెండవది టాక్స్ . ఇన్ఫ్లేషన్ గురించి క్రింది  లింక్ క్లిక్ చేసి తెలుసుకోగలరు.
http://telugufinancialschool.blogspot.in/2012_09_27_archive.html

ఇన్ఫ్లేషన్ అంటే మీ డబ్బూ యొక్క కనుగోలు శక్తి కాలంతో పాటు క్రమంగా తగ్గిపోవడం .మీ వద్ద నేడు లక్ష రూపాయలు ఉంటె పది సంవత్సరాల తర్వాత ఆ లక్ష రూపాయలతో పాటు వచ్చే  వడ్డీ కూడా కలిపి ఈ రోజు కనుగోలు చేసిన వస్తువులను , పది సంవత్సరాల తర్వాత మీరూ అదే వస్తువులను కనుగోలు చేయలేకపోవడం.అంటే మీరూ బ్యాంక్ లో డిపాజిట్ చేయడం వలన వచ్చిన వడ్డీ వలన ఎలాంటి ఉపయోగం లేదు.
వాస్తవంగా చెప్పాలి అంటే మీ బ్యాంక్ వడ్డీ రేటు నుండి ఇన్ఫ్లేషన్ రేటు తగ్గిస్తే వచ్చేది వాస్తవమైన రాబడి. ఉదాహరణకు మీకు బ్యాంక్ వడ్డీ రేటు 8% వస్తే ప్రస్తుతం ఇన్ఫ్లేషన్ 7% ( సాదారణంగా ఇన్ఫ్లేషన్ 5-6% నమోదు అవుతుంది.) ఐతే మీకూ వాస్తవంగా వచ్చిన రాబడి 8-7=1% మాత్రమే.మీ రాబడి పై టాక్స్ 1.5% అనుకుంటే మీకు వాస్తవంగా వచ్చే రాబడి = బ్యాంక్ అందించే వడ్డీ – ఇన్ఫ్లేషన్ – టాక్స్ అంటే మీ రాబడి   8-7-1.5 = -0.5%మాత్రమే.దీని వలన మీకు ఏమి అర్ధం అయినది. బ్యాంక్ ఫిక్సుడ్ డిపాజిట్లు ఎలాంటి పాజిటివ్ రిటర్న్స్ ఇవ్వడం లేదు.కాకపోతే ఈ విషయం మీకు కంటికి కనబడకుండా మీ  రాబడిని ఇన్ఫ్లేషన్ మరియు టాక్స్ మింగేస్తున్నాయి. అందువలన బ్యాంక్ డిపాజిట్లు  చేయడం వలన ఎలాంటి ఉపయోగం లేదు అని అర్ధం అయ్యింది కదా?. ఇక స్టాక్ మార్కెట్  విషయానికి వస్తే ఎలాంటి పరిస్తుతులలో  కూడా దీర్ఘకాలానికి  16-20% రాబడి ఖచ్చితంగా అందచేస్తున్నాయి.కావున  స్టాక్ మార్కెట్ లో రాబడి కనీసం 16% వచ్చిన మీ వాస్తవ రాబడి 16-7-0=9%  అవుతుంది. అంటే ఇన్ఫ్లేషన్ తగ్గించగా మీ వాస్తవ రాబడి 9%  అవుతుంది అంటే మంచి రాబడే కదా ? స్టాక్ మార్కెట్ లో దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ పై ఎలాంటి టాక్స్  ఉండదు. స్టాక్ మార్కెట్ లో  స్వల్ప కాలంలో  ఒడిదుడుకులు ఉన్నప్పటికీ  దీర్ఘకాలం మాత్రం మంచి రాబడి అందిస్తుంది.
ఇక రెండవది బ్యాంక్ లో డిపాజిట్ చేయడం వలన  LIQUIDITY IN EMERGENCY ఉంటుంది అంటారు. కాని మీరూ ఒక్క విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఎమర్జెన్సీ కోసం  మీరూ ఎమర్జెన్సీ ఫండ్  ఏర్పాటు చేసుకోవాలి .అంతే కాని మొత్తం డబ్బూ బ్యాంక్ లో   ఫిక్సుడ్ డిపాజిట్లు చేయడం మంచిది కాదు.కాబట్టి మీ వయస్సు కి అనుగుణంగా దీర్ఘకాలిక ఉద్దేశంతో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయండి. స్టాక్ మార్కెట్ పై మీకూ సరియైన అభిప్రాయం లేకుంటే కనీసం స్థిరాస్తి లో నయిన ఇన్వెస్ట్ చేయండి. అంటే స్థలాలు కొనడం లాంటిది.  బ్యాంక్ లో  బ్యాంక్ లో  ఫిక్సుడ్ డిపాజిట్లు చేయడమంత తెలివి తక్కువ పని మరొకటి లేదు అనే విషయం తెలుసుకోండి.

ఈవారం స్టాక్ మార్కెట్19-11-2012to23-11-2012


ఈవారం స్టాక్ మార్కెట్19-11-2012to23-11-2012
 ఇంతకుముందు  మీకు తెలియచేసిన విధంగా గత చరిత్రను బట్టి చూస్తె  మార్కెట్  మూహరత్ ట్రేడింగ్ ముందు లేదా తర్వాత సుమారు 5-6% కదలిక ఉంటుంది అని మీకు తెలియచేయడం జరిగినది. అందుకు సిద్దంగా ఉండ్నది అని తెలియచేయడం కూడా జరిగినది.మూహరత్ ట్రేడింగ్ రోజు నిఫ్టీ హై 5708 నుండి ఇప్పటికే సుమారు 2%నష్టపోవడం జరిగినది.అదే విధంగా ఈ వారం మార్కెట్ గురించి చెప్పాలి అంటే 22 నుండి ప్రారంభం కాబోతున్న పార్లమెంట్ శీతాకాల  సమావేశాలు , ఇజ్రాయిల్ దాడులు , అమెరికా  ఫిజికల్ క్లిఫ్ , వివిధ పార్టీల రాజకీయ నాయకులు చేసే కామెంట్స్ , అంతర్జాతీయ మార్కెట్స్ ప్రభావం మోఅదలగు వాటి వలన  ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. ఇక టెక్నికల్ అనాలసిస్ విషయానికి వస్తే నిఫ్టీ అప్ ట్రెండ్ లైన్ దగ్గరకు సమీపిస్తుంది. నిఫ్టీ అప్ ట్రెండ్ లైన్ సపోర్ట్  5520 వద్ద కలదు. అదే విధంగా  నిఫ్టీ ఇంతకు ముందు ఏర్పరిచిన గ్యాప్ టాప్ కూడా 5520 వద్ద  మరియు ఫిబోనస్సీ సపోర్ట్ కూడా 5520-5525 వద్ద కలవు . అంటే నిఫ్టీ  5520-5525  వద్ద  సపోర్ట్ కలదు. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక నిలదోక్కుకోనట్టు ఐతే నిఫ్టీ ఇంతకు ముందు ఎర్పరిచిన గ్యాప్ 5527-5448  వరకు నిఫ్టీ దిగజారి గ్యాప్ ను పూరించే అవకాశం కూడా కలదు.నిఫ్టీ ఇది వరకు రెండు సార్లు 50sma  క్రిందకు దిగాజారినప్పటికి  కూడా క్రింద నిలదొక్కు కోలేక  బిగ్ అప్ మూవ్ నిఫ్టీ లో రావడం జరిగినది. శుక్రవారం రోజు కూడా నిఫ్టీ 50sma క్రింద క్లోజ్ కావడం జరిగినది. నిఫ్టీ కి తక్షణ రెసిస్టన్స్ 5585,5650 వద్ద కలవు. 5685 పైన క్లోజ్ కానంత వరకు  ప్రతి పై లెవల్ సెల్లింగ్ కొరకే ఉపయోగించుకోవాలి.అంటే సెల్ అన్ రైజ్. స్టాప్ లాస్ తప్పక ఉపయోగించండి.            


స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేయాలి అనుకుంటున్నారా ? ఐతే మీరూ తప్పనిసరిగా చదవండి.?


స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేయాలి అనుకుంటున్నారా ? ఐతే మీరూ  తప్పనిసరిగా చదవండి.?
మీరూ స్టాక్ మార్కెట్ లోకి ప్రవేశించి ట్రేడింగ్ చేయాలి అనుకుంటున్నారా? అంటే ఈక్విటీ మార్కెట్,కమోడిటీ మార్కెట్ , కరెన్సీ , ఫారెక్స్ మార్కెట్  ఏదైనా కావచ్చు. మీరూ  ట్రేడింగ్ చేయాలి అనుకుంటేమాత్రం మీరూ ఇతరుల సలహాలపై లేదా టిప్స్ పై ఎట్టి పరిస్థుతులలో ఆధారపడవద్దు. మీరూ స్వయంగా స్టాక్ మార్కెట్ పై పూర్తీ అవగాహన కలుగచేసుకొని , మీరూ స్టాక్ మార్కెట్ లో స్వయం నిర్ణయాలు తీసుకొనే శక్తి,అవగాహన,పరిజ్ఞానం సంపాదించిన తర్వాత మాత్రమే మీరూ స్టాక్ మార్కెట్ లోకి ప్రవేశించడం లేదా ట్రేడింగ్ చేయడం ప్రారంభం చేయండి. దీనికి కొంత సాధన,కొంతసమయం పడుతుంది.అయినా సరే స్టాక్ మార్కెట్ పై పూర్తీ అవగాహన కలుగ చేసుకోవడం తప్పనిసరి.స్టాక్ మార్కెట్ నిన్న ఉంది, నేడు ఉంది , రేపు ఉంటుంది. కాని మీరూ ఎలాంటి అనుభవం లేకుండా ఇతరుల సలహాల, టిప్స్ పై ఆధారపడి కనుక మార్కెట్ లోకి ప్రవేశిస్తే మీవద్ద గల కాపిటల్ ఒక్కసారి నష్టపోతే మీరూ జీవితంలో మళ్ళీ స్టాక్ మార్కెట్ లో వచ్చే మంచి లాభాలు అందుకొనే అవకాశం ఎంత మాత్రం ఉండదు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ లో టిప్స్ పై ఎత్తి పరిస్థుతులలో అధారపడవద్దు. స్టాక్ మార్కెట్ లో నా అనుభవం సుమారు పన్నెండు సంవత్సరాల పైననే. నా అనుభవంలో కొన్ని వేల మంది టిప్స్ అందించే వారిని చూడటం జరిగినది. అందులో చాలా మంది కనీసం మార్కెట్ పై సరియైన అవగాహన లేని వారే. ఏ టిప్ ఏ కారణం చేత ఇస్తున్నారో కూడా కనీసం సమాధానం చెప్పలేని వారే.  అందరూ అలాంటి వారే అని చెప్పలేను కాని  అధిక శాతం మంది అలాంటి వారే అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఒకవేళ  టిప్స్ అందించే వారూ సమర్దులైనప్పటికి కూడా  ట్రేడింగ్ సమయంలో మార్కెట్ కదలికలకి  అనుగుణంగా స్పందిచే తత్త్వం ఒక్కొక్కరికి , ఒక్కోవిధమగా ఉంటుంది. టిప్స్ అందించే వారూ చెప్పేది ఒక్కటే గుడ్డిగా నేను చెప్పే టిప్స్ ను ఫాలో అవ్వండి అని. కాని అది ఎంత మాత్రం మంచిది కాదు. లైవ్ మార్కెట్ లోకి వచ్చే సరికి ప్రతి ఒక్కరిని వారి ఎమోషన్స్ , రిస్క్ తీసుకొనే సామర్ధ్యం తప్పనిసరిగా ప్రభావితం చేస్తాయి. మార్కెట్ లో ఒక్కో వ్యక్తీ రిస్కు తీసుకొనే సామర్ధ్యం కూడా ఒక్కో విధంగా ఉంటుంది. అందువలన  మీరూ టిప్స్ అందించే వారూ ప్రతి రోజూ ఇంత లాభం , అంత లాభం అని చెప్పే మాయా మాటలు నమ్మి మోసపోకండి. వారికి లాభం వచ్చినది అని మీకూ రావాలి అని లేదు. అది మీ ట్రేడింగ్ సైకాలజీ పై ఆధారపడి ఉంటుంది. అందువలన వీలయినంత వరకు మీరీ స్వయంగా మార్కెట్ పై అవగాహన కలుగ చేసుకొనే ప్రయత్నం చేయండి. వీలయినంత వరకు పత్రికలలో  వచ్చే బిజినెస్ న్యూస్ , మంచి స్టాక్ మార్కెట్ పుస్తకాలు లేదంటే తెలుగులో మొదటిసారిగా స్టాక్ మార్కెట్ పై నేను వ్రాసిన పుస్తకాలు కాని చదివి మార్కెట్ పై పూర్తీ అవగాహన పొందిన తర్వాత మాత్రమే మీరూ కస్టపడి సంపాదించిన డబ్బూ తో ట్రేడింగ్ చేయండి. స్టాక్ మార్కెట్ అంటే రిస్కు తో కూడుకున్నది అనే విషయం మర్చిపోవద్దు. కొన్ని సమయలాలో మీ డబ్బూ మొత్తం నష్టపోయే అవకాశం ఉంది అని మాత్రం మర్చి పోవద్దు.                          





డీమ్యాట్ ఖాతా తెరవడం ఎలా?


డీమ్యాట్ ఖాతా తెరవడం ఎలా?
డీమ్యాట్ ఖాతా తెరవటానికి ముందుగా మీరు మీ పేరున బ్యాంకు ఖాతా  తెరవండి. బ్యాంకు ఖాతా వివరాలు తెలియజేయందే డీమ్యాట్ ఖాతా తెరిచే అవకాశం ఉండదు. బ్యాంకు ఖాతా   తెరవడం వల్ల మీకే లాభం. భవిష్యత్తులో మీరు అందుకునే  డివిడెండు, వడ్డీ వారెంట్లపైనే  మీ ఖాతా సంఖ్యను ముద్రిస్తారు. ఇవి పోస్టులో మిస్సయినా  ఇతరులేవ్వరు మార్చుకోవటానికి  వీలుండదు. డీమ్యాట్ ఖాతా తెరిచిన తర్వాతా బ్యాంకు ఖాతాను మూసివేసినా, మరో ఊరికి  లేదా శాఖకు మార్చుకున్నా డిపాజిటరీ  పార్టిసిపెంట్  కు   తప్పకుండా వెంటనే  తెలియచేయండి.
బ్యాంకు ఖాతా తెరిచినా అనంతరం డీమ్యాట్ ఖాతా తెరవటానికి డిపాజిటరి పార్టిసిపెంట్స్ దగ్గరకు వెళ్ళండి.బ్యాంకులు లేదా బ్రోకరేజీ సంస్థలు డిపాజిటరి పార్టిసిపెంట్స్ గా వ్యవహరిస్తాయి.డీపీ దగ్గర దరఖాస్తు  పత్రంలో అన్ని వివరాలు  పూర్తిచేసి ఇవ్వాలి. దరఖాస్తుతో పాటు గుర్తింపు , చిరునామా దృవీకరణ పత్రాలు జతచేయాలి.సంతకం , ఫోటోలను నిర్ధారించడానికి  ఇప్పటికే డీమ్యాట్ ఖాతా ఉన్నవారు సంతకం చేయాలి.ద్రువీకరించే వారు లేకుంటే పాసపోర్ట్, ఫోటో గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసన్స్ , పాన్ కార్డు ఉన్న చాలు.  ఇవి మీకు చిరునామా దృవీకరణకు కూడా ఉపయోగపడతాయి. దరఖాస్తు చేసుకునే సమయంలో అసలు పత్రాలను తీసుకవెల్లడం  మరచిపోవద్దు..

పరిశీలన పూర్తీ చేసిన  తర్వాత నిర్దారిత  ఒప్పంద పత్రాలపై  సంతకాలు చేయాలి.మీ హక్కులు , బాధ్యతలు వివరంగా ఈ ఒప్పంద పత్రంలో ఉంటాయి.ఒప్పంద పత్రం ప్రతిని అడిగి తీసుకోవాలి.తర్వాత మీకు ఖాతా నంబరు ఇస్తారు .దీన్ని బెనిఫిషియరి వొనర్ ఐడెంటీకేషన్ నంబర్  అంటారు.
డీమ్యాట్ ఖాతా ఒక్కటే తెరవాలా?
ఒక్క వ్యక్తీ ఒక్క డీమ్యాట్ ఖాతానే తెరవాలన్న నిబందనేమి లేదు . అదే డీపీ వద్ద లేదా వేరే డీపీ ల వద్ద ఎన్ని ఖాతాలను ఐనా తెరవవచ్చు. మీ బ్రోకరుకు ఖాతా ఉన్న చోటనే తెరవాలి అన్న పట్టింపు లేదు. మీ భార్య /భర్త  లేదా పిల్లలతో కలిసి దరఖాస్తు చేసుకోవాలనుకుంటీ మీ ఒక్కరి పేరునే ఖాతా ఉంటె సరిపోదు.మీరు ఎవ్వరి ఎవ్వరి పేరుమీదా  షేర్లు పొందాలి అనుకుంటే  వారి వారి పేర్లతో ఖాతా తెరవాలి.నామినేషన్  ఇవ్వడం కూడా చాలా ముఖ్యమే. ఇన్వెస్టర్ చనిపోయిన సందర్భంలో  చాలా మంది  డీమ్యాట్ ఖాతాదారులు నామినేషన్ లేక వారసత్వ పత్రాల కొరకు  నెలల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి ఉంటుంది..కావున నామినేషన్ అనేది చాలా ముఖ్యం.
చార్జీలు
డీమ్యాట్ ఖాతా నిర్వహణకు , ముందుగా ఖాతా తెరవటానికి  కొంత చార్జీలు చెల్లించాలి. కొందరు డీపీ లు ఎలాంటి చార్జీలు  వసూలు చేయడం లేదు. కొన్ని సంస్థలు ఖాతాదారులకు ఉచితంగా  డీమ్యాట్ ఖాతా  తెరిచే అవకాశాన్ని కల్పిస్తున్నాయి..డాక్యుమెంటేషన్ చార్జీలు. ప్రతి ఏటా ఖాతా  నిర్వహణకు  చార్జీలు చెల్లించాలి.ఈ చార్జీలు  ముందుగా చెల్లించాలి. దీనికి అదనంగా ప్రతి నెల కస్టోడియన్ ఫీజు చెల్లించాలి .ఖాతా లో ఉన్న సెక్కురిటీల సంఖ్య ( అంతర్జాతీయ సెక్కురిటీల గుర్తింపు సంఖ్య ఐ స్ ఐ న్ ) ను  బట్టి  ఈ ఫీజు ఆధారపడి ఉంటుంది. ఇక సెక్కురిటీలు అమ్మిన , కొన్న ప్రతి సారి కొంత చార్జీ చెల్లించాలి. నెలలో నిర్వహించిన లావాదేవీలకు కలిపి ఒక్కసారే వసూలు చేస్తారు. సర్వీసు చార్జీ అదనం. డీపీ తో పని లేకుండా ఇంటర్నెట్లో మీరే స్వయం గా   మీ లావాదేవీల వివరాలు తెలుసుకోవచ్చు.


స్టాక్ మార్కెట్ లో ఏవిధంగా ప్రవేశించాలి?


స్టాక్ మార్కెట్ లో ఏవిధంగా ప్రవేశించాలి? 

డీమ్యాట్ ఖాతా
మీరు  ప్రైమరీ మార్కెట్ లేదా సెకండరీ మార్కెట్  లలో  షేర్స్  కొనాలి అంటే  మీకు ముందుగా కావలసినది డీమ్యాట్ ఖాతా. షేర్ సర్టిఫికేట్లతో  ముడిపడిన అనేక సమస్యలకు  తెర దించుతూ  అమల్లోకి వచ్చింది కాగిత రహిత లావాదేవీల విధానం . దీనినే డీమ్యాట్ అంటారు. నేడు షేర్లు  కొనాలన్న ,అమ్మాలన్న ,ఈ విధానం తప్పనిసరి . పేరుకు తగ్గట్టు గానే  ఈ విధానం లో షేర్ సర్టిఫికెట్లు  ఉండవు. అంతా ఎలక్రానిక్ రూపంలోనే ఉంటుంది.ఎలక్రానిక్ రూపంలోకి మార్చిన షేర్లను కొనాలన్న, అమ్మాలన్న  డిపాజిటరి పార్టిసిపేట్స్,(డీపీ) వద్ద ఒక ఖాతా (డీమ్యా ట్ ఖాతా) ను  తప్పని సరిగా తెరవాల్సి ఉంటుంది.అమ్మకాలు, కొనుగోళ్లను బట్టి మీ ఖాతాలో షేర్ల సంఖ్యలో హెచ్చుతగ్గులు  ఎలక్రానిక్ రూపంలో నమోదవుతాయి. ఒక విధంగా ఇది బ్యాంకు డిపాజిట్ లాంటిదే.బ్యాంకు లో మీరు సొమ్ము జమచేస్తే ఈ వివరాలు మీ ఖాతాలో జమ అవుతాయి.అలానే షేర్లు కూడా.
డిపాజిటరీ , డిపాజిటరి పార్టిసిపెంట్స్ అంటే ఏమిటి ?
ఇన్వెస్టర్లకు  చెందిన షేర్లను ఎలక్రానిక్ రూపంలో  భద్రపరిచే సంస్థలనే డిపాజిటరీలంటారు. రిజిస్టరైన డిపాజిటరి పార్టిసిపేట్స్,(డీపీ) ద్వారా డిపాజిటరీలు సేవలు అందిస్తాయి.ప్రస్తుతం సెబి వద్ద రిజిస్టరైన సంస్థలు రెండు. అవి నేషనల్ సెక్యురిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ .(ఎన్ఎస్ డీల్)మరియు  సెంట్రల్ డిపాజిటరీ  సర్వీస్ లిమిటెడ్ (సీడీఎస్ డీల్) .16 అంకెల్లో  ఖాతా నం ఉంటే  సీడీఎస్ ల్  ఖాతాగా,,అంకెలు ఇంగ్లీషు అక్షరాలూ  కలగలిసి ఉంటె  ఎన్ఎస్ డీ ల్ ఖాతా గా సులభంగా గుర్తించవచ్చు. 
డిపాజిటరీ ప్రతినిధినే డీపీ అంటారు. డిపాజిటరి పార్టిసిపెంట్స్ ద్వారనే  డిపాజిటరీలు ఖాతాదారులతో లావాదేవీలు నిర్వహిస్తాయి. సెబీ వద్ద రిజిస్టరైన సంస్థలు మాత్రమే డీపీగా   వ్యవహరించటానికి  వీలుంటుంది.డిపాజిటరీని బ్యాంకు గాను   డీపీని బ్యాంకు శాఖగాను  పరిగణించవచ్చు. ప్రస్తుతం 821డీపీ లు సెబీ వద్ద నమోదయ్యారు.