స్టాక్ మార్కెట్ లో టెక్నికల్ అనాలసిస్ లో చార్ట్స్ యొక్క ప్రాముఖ్యత.

స్టాక్ మార్కెట్ లో  టెక్నికల్ అనాలసిస్ లో చార్ట్స్ యొక్క ప్రాముఖ్యత.


టెక్నికల్ అనాలసిస్ లో చార్ట్స్ ని విశ్లేషించినప్పుడు ఆది మీకు మార్కెట్ లో కి ఎప్పుడు ప్రవేశించాలి, ఎప్పుడు బయటకు రావాలి అనే విషయం లో సహాయం చేస్తుంది. మార్కెట్‌లో అతి వేగంగా జరిగే పెరుగుదలను మరియు పతనాన్ని గుర్తించడానికి సహాయపడుతుంది. ఇన్వెస్ట్‌మెంట్ మీద రాబడి వేగంగా రావడంలో తోడ్పడుతుంది. చార్ట్స్ ని ఉపయోగించడం వల్ల మీకు స్టాక్  యొక్క ధరలో జరిగే పెరుగుదలని , ఎంతకాలం లో పెరగగలదొ  అనే విషయాన్ని తెలియచేయడం వల్ల మీరు దాని లో ట్రేడింగ్ చేయాలో లేక ఇన్వెస్ట్ చేయాలో నిర్ణయం తీసుకొనవచ్చు.
చార్టింగ్  అనేది టెక్నికల్ అనాలసిస్ కు  పునాది లాంటిది . చార్ట్స్  ఎప్పుడు వాస్తవాన్నే తెలుపును. కాని , చార్ట్స్ ను  చదవడంలో మానవ తప్పిదం వల్ల పొరపాటు జరగవచ్చును కాని చార్ట్స్ వల్ల కాదు. పట్టుదలతో చార్ట్స్ ని చదివి అర్థం చేసుకొంటె ఆ స్టాక్ యొక్క భవిష్యత్తు ధరని  సులభంగా ఉహించవచ్చును . చార్ట్  అనునది నిర్ణీత కాలంలో ఆ స్టాక్స్ యొక్క డిమాండ్ మరియు సప్లై లను చార్ట్ రూపంలో ప్రతిభంభిస్తుంది. చార్ట్స్   పాటర్న్స్ ని   స్టాకు మార్కెట్ , ఫారెక్స్ మార్కెట్, కమోడిటీ మార్కెట్ మరియు ప్యూచర్ మార్కెట్ లలో , డే ట్రేడింగ్, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ట్రేడింగ్ , ఇన్వెస్ట్మెంట్ లలో ఉపయోగించవచ్చు.
ఆ నిర్ణీత కాల వ్యవధి అనునది నిమిషాలు , గంటలు,రోజులు, వారాలు మరియు నెలలు కూడ కావచ్చును . నిర్ణీత కాల వ్యవధి లో గల ఆ స్టాక్ యొక్క హై మరియు లో ప్రైస్ ని నిలువు బారు రూపం లో  X-axis మరియు , Y-axix ల మీద గీయడం వల్ల చార్ట్ అనునది ఏర్పాటు అవుతుంది. చార్ట్ మీద  X-axis,అనునది టైంను    Y-axix   ప్రైస్ ను  తెలుపుతుంది. 




 టెక్నికల్ అనాలసిస్ లో  ఇంతకుముందు ఏమీ జరిగినదో ఆది మళ్లీ తిరిగి జరుగును అనే భావనే బలంగా ఉంటుంది. అనగా స్టాక్స్ యొక్క కదలిక సైకిల్ లాగా తిరుగును . చార్ట్ ని చదవడం అనునది ఆభ్యాసం  ద్వారా కాలక్రమేణా సొంతం అవుతుంది. టెక్నికల్ అనాలసిస్‌లో  వివిధ రకాల  కాల వ్యవధి గల చార్ట్స్ ను ఉపయోగిస్తారు. డైలీ  చార్ట్ అనునది ఆ రోజు యొక్క ప్రైస్ రేంజ్ ను  సూచిస్తుంది. తక్కువ వ్యవధి గల చార్ట్స్ లో ప్రైస్ రేంజ్ అనేది ఓడిదొడుకులుగా ఉండును. కావున ఎక్కువ  కాల  వ్యవధి గల చార్ట్స్ ఉపయోగించడం మంచిది.కొంత ప్రావీణ్యత  సంపాదించిన తర్వాత తక్కువ కాల వ్యవధి గల వాటిని ఉపయోగించవచ్చు.ఎక్కువ కాల వ్యవధి గా చార్ట్స్ నందు లాంగ్ టర్మ్ ట్రెండ్‌ని గుర్తుపట్టవచ్చు.