క్రూడ్ ఆయిల్ టెక్నికల్ అనాలసిస్

క్రూడ్ ఆయిల్ టెక్నికల్ అనాలసిస్

Mcx లో క్రూడాయిల్  ఆల్ టైమ్ ఆగస్టు 2008 లో 6333 ఐతే , ఆల్ టైమ్ లో  జనవరి 2009 లో 1626. కేవలం ఐదు నెలల కాలంలో 4700 పాయింట్లు  లేదా  75%  క్రూడాయిల్  పతనం కావడం  జరిగినది. జనవరి 2009 లో 1626  నుండి ఏప్రిల్ 2011 లో 5038 కు చేరుకోవడం జరిగినది. 5038 నుండి  మళ్ళీ 3543 వరకు పతనం కావడం  జరిగినది. 3543 నుండి ర్యాలీ జరిగి కేవలం ఎనిమిది నెలల కాలంలో 2100 పాయింట్లు పెరిగి  మార్చి 2012 లో 5635 వరకు  చేరుకోవడం జరిగినది. 5635 నుండి జూన్   2012 లో  4448  పాయింట్ల  వరకు పతనం కావడం జరిగినది.  ఇవన్ని పరిగణలోకి తీసుకుంటే టెక్నికల్ అనాలసిస్ ప్రకారం 5175-5190 మధ్య చాలా బలమైన రెసిస్టన్స్ రావడం జరుగుతుంది. అదే విధంగా  అంతర్జాతీయంగా కూడా క్రూడాయిల్  $93.80 to $94.10   మధ్య రెసిస్టన్స్ రావడం జరుగుతుంది.నిన్న కూడా $93.78  హైకి  చేరుకోవడం జరిగినది. క్రూడాయిల్ $94.10  బ్రేక్ కానప్పటి వరకు  Mcx లో క్రూడాయిల్  5175-5190 వద్ద బలమైన రెసిస్టన్స్ ఎదుర్కొగలదు. అందువలన Mcx లో క్రూడాయిల్   ప్రస్తుతం నలబై , యాభై పాయింట్ల  కోరకు  బై చేయడం కంటే పై లెవల్లో సెల్ చేయడం చాలా మంచిది.గత 21 ట్రేడింగ్ సెషన్స్ నుండి Mcx లో క్రూడాయిల్  500 పాయింట్ల వరకు పెరగడం జరిగినది. 5190-5195 పైన మాత్రమే మళ్ళీ  Mcx లో క్రూడాయిల్  లో ర్యాలీ రావడం జరుగుతుంది . అంత వరకు పై లెవల్లో  5175-5190  స్టాప్ లాస్ తో సెల్ చేయడం మంచిది . 

నిఫ్టీ అప్ డేట్

నిఫ్టీ అప్ డేట్    
మీకూ సోమవారం అనాలసిస్ లో తెలియచేయడం జరిగినది.పై లెవల్లో  సెల్లింగ్ చేయవచ్చు అని. అదే విధంగా నిఫ్టీ గత వారం ఏర్పాటు చేసినటువంటి గ్యాప్ ను పూరించడం జరిగినది.  అంతే కాకుండా ఇది వరకు రెసిస్టన్స్ 5965 ఇప్పుడు సపోర్ట్ గా మారడం జరిగినది. నిఫ్టీ ప్రస్తుతం  5965 వద్ద సపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ నిఫ్టీ 5965  బ్రేక్ జరిగితే మరొక గ్యాప్ 5919-5935 కూడా పూరించగలదు. ప్రస్తుతం 5965 క్రింద స్టాప్ లాస్ తో బై చేయడం , పై లెవల్లో 6050 స్టాప్ లాస్ తో సెల్  చేయడం మంచిది. 5920 క్రింద క్లోజ్ కానప్పటి వరకు  వరకు లాంగ్ పోజిషన్స్  కొనసాగించవచ్చు.