ఈ వారం స్టాక్ మార్కెట్ 18-02-2013 to 22-02-2013



ఈ వారం స్టాక్ మార్కెట్ 18-02-2013 to 22-02-2013


మీకూ గత కొన్ని వారాల నుండి  నిఫ్టీ పై  లెవల్లో 6100 పైన  నిలదొక్కుకోనంత వరకు  పై లెవల్లో సెల్లింగ్ చేయడం మంచిది అని తెలియచేయడం జరిగినది. ఎవరైతే ఈ బ్లాగ్ క్రమం తప్పకుండా ఫాలో అవుతున్నారో వారూ మంచి లాభాలు అందుకోవడం జరిగినది.నిఫ్టీ గత ఎనిమిది నెలల నుండి ఏర్పాటు కాబడిన ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ కావడం జరిగి దాని క్రిందనే క్లోజ్ కావడం జరిగినది. నిఫ్టీ కి 5950 వద్ద  సపోర్ట్ కలదు. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా దిగితే మళ్ళీ 5890 వద్ద కలదు అని మీకూ గత వారం పోస్టులో కూడా తెలియచేయడం జరిగినది. ఐతే నిఫ్టీ   5890  క్రింద క్లోజ్ కావడం జరిగినది. కాబట్టి తర్వాత సపోర్ట్ ఐనటువంటి 5815 వరకు నిఫ్టీ సులభంగా దిగాజారగలదు.నిఫ్టీలో ఒకవేళ ర్యాలీ వచ్చిన ప్రస్తుతం  5950 వరకే పరిమితం కాగలదు. 5950 వద్ద కూడా నిఫ్టీ సెల్లింగ్ చేయడమే మంచిది.  ఈ విధంగా మీకూ గత వారం పోస్ట్ లో చాలా క్లియర్ గా తెలియచేయడం జరిగినది. అదే విధంగా నిఫ్టీ 5969 వరకు ర్యాలీ తీసుకొని అక్కడి నుండి దిగజారి 5854 వరకు పడిపోవడం జరిగినది.ఈ వారం కూడా నిఫ్తీకి కి 5815-5790  దరిదాపుల్లో సపోర్ట్ కలదు. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా నిలబడలేకపోతే  నిఫ్టీ మరింత పడిపోవడానికి అవకాశం కలదు.  అందువలన నిఫ్టీ సెల్ అన్ రైస్ మెథడ్ ఫాలో కావడం మంచిది. అదే విధంగా ఒకవేలా క్రింది లెవల్లో నిఫ్టీ బై చేసిన కూడా స్టాప్ లాస్ తప్పనిసరిగా పాటించడం చాలా మంచిది.